తిరుపతిలో ఓ ఇంటిలో చోరీ.. రూ.14 లక్షల సొత్తు అపహరణ

తిరుపతిలోని గాయత్రినగర్‌లో భారీ చోరీ జరిగింది. తలుపులు తొలగించి ఇంట్లోకి చొరబడిన ముఠా రూ.10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షల నగదును దోచుకుంది. చోరీ జరిగినట్టు సాయంత్రం వరకు యజమాని గుర్తించకపోవడం గమనార్హం. ఆ తర్వాత తెలుసుకుని లబోదిబోమన్నాడు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.


More Telugu News