కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy visits Col Santosh Babu family
  • సూర్యాపేట వెళ్లిన కిషన్ రెడ్డి
  • సంతోష్ బాబు కుటుంబానికి సైన్యం అండగా ఉంటుందని వెల్లడి
  • సంతోష్ బాబు లక్ష్యాన్ని ప్రధాని నెరువేరుస్తారన్న కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవలే అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్లిన ఆయన సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు ధైర్యవచనాలు పలికారు. సంతోష్ బాబు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

సంతోష్ బాబు ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ లక్ష్యాన్ని ప్రధాని మోదీ నెరవేరుస్తారని ఉద్ఘాటించారు. భారత సైన్యం సంతోష్ కుటుంబానికి అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తున్న చైనాకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ ప్రపంచదేశాల మద్దతు కూడగడుతున్నారని వెల్లడించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా చైనా వస్తువులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Kishan Reddy
Santosh Babu
Suryapeta
Army
Modi

More Telugu News