అసెంబ్లీ వద్ద కుక్క మొరగడంతో... బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్!
Add ap7am to your home Screen

అసెంబ్లీ వద్ద కుక్క మొరగడంతో... బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్!

Balakrishna latest dialogue on YSRCP Leaders
  • ఓటు వేయడానికి వెళ్తుండగా మొరిగిన కుక్క
  • ఎవరికి అర్థమయ్యే భాషలో వారికి చెప్పాలని బాలయ్య కామెంట్
  • మేము అరిచేవాళ్లం కాదని వ్యాఖ్య
ఏపీలో రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓటు వేయడానికి టీడీపీ తరపున మొదట ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చారు. అసెంబ్లీ వద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా... దగ్గర్లో ఉన్న ఓ కుక్క మొరిగింది. ఈ సందర్బంగా బాలయ్య సమయోచితంగా స్పందిస్తూ... ఎవరికి అర్థమయ్యే భాషలో వారికి చెప్పాలని అన్నారు. తాము అరిచేవాళ్లం కాదని... కరిచేవాళ్లమని అన్నారు. ప్రత్యర్థులను దృష్టిలో పెట్టుకుని బాలయ్య ఇలా వ్యంగ్యంగా అన్నట్టు భావిస్తున్నారు.

మరోవైపు ఇప్పటి వరకు 167 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు అరెస్ట్ కారణంగా, అనగాని అనారోగ్యం కారణంగా ఓటు వేయడానికి రాలేదు. టీడీపీ రెబెల్స్ వల్లభనేని వంశీ, మద్దాలి గిరి ఓటు వేశారు. మరో సభ్యుడు కరణం బలరాం ఓటు వేయాల్సి ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు.
Balakrishna
Telugudesam
Dog

More Telugu News