భారత్ అభ్యంతరాలు బేఖాతరు.. కొత్త మ్యాప్ కు నేపాల్ పార్లమెంటు ఆమోదం
- కొత్త మ్యాప్ కు ఎగువసభ ఏకగ్రీవ ఆమోదం
- గత శనివారం ఆమోదం తెలిపిన దిగువసభ
- ప్రెసిడెంట్ సంతకం చేస్తే బిల్లుకు చట్టబద్ధత
భారత్ కు మిలిటరీ పరంగా ఎంతో కీలకమైన కాలాపానీ, లిపులేక్, లింపియధురా ప్రాంతాలను కొత్త మ్యాప్ లో నేపాల్ చేర్చింది. భారత్ పెడుతున్న అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు ఎగువసభలో ఉన్న మొత్తం 57 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు.