అందరికీ ఫ్రీగా కరోనా చికిత్స చేయించమన్నందుకు రూ. 5 లక్షల ఫైన్ విధించిన హైకోర్టు!
- ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్న పిటిషనర్
- మహారాష్ట్రలో అందరికీ ఫ్రీగా చికిత్స చేయించాలని విన్నపం
- డిమాండ్ అర్థరహితంగా ఉందన్న హైకోర్టు
ఈ పిటిషన్ ను ప్రముఖ విద్యావేత్త సాగర్ జోంధాలే దాఖలు చేశారు. కరోనాను ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని... ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితులందరికీ ఉచితంగా చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను కోర్టు తప్పుపట్టింది.