లోకేశ్ కు ఉన్న అర్హత ఏమిటి? ఎంపీ రఘురామకృష్ణంరాజు తేడా మనిషి: అంబటి రాంబాబు
- వడ్డీతో సహా లోకేశ్ ఏం చెల్లిస్తాడు?
- డైలాగులు మాట్లాడటం కాదు, దమ్ముండాలి
- రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోక్కర్లేదు
తప్పు చేసిన వారిని కోర్టులో నిలబెడతామని... ముగ్గురి అరెస్టే దీనికి తొలి అడుగని అంబటి అన్నారు. అన్ని ఆధారాలతో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. దొంగల ముఠాకు చంద్రబాబు నాయకుడని విమర్శించారు. చంద్రన్న కానుక, ఫైబర్ నెట్, రాజధాని భూముల వ్యవహారాలలో ఎంత మంది జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందోనని అన్నారు.
జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ... ఆయన ఒక తేడా మనిషని చెప్పారు. ఆయన ఎప్పుడూ అలాగే మాట్లాడతారని... ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.