భారత భూభాగంతో ఉన్న కొత్త మ్యాప్ కు నేపాల్ పార్లమెంటు దిగువసభ ఆమోదం
- భారత్ భూభాగాలతో నేపాల్ కొత్త మ్యాప్
- 370 చదరపు కి.మీ. భూమిని తమదని చెప్పుకుంటున్న నేపాల్
- తదుపరి నేషనల్ అసెంబ్లీకి వెళ్లనున్న బిల్లు
కొత్త మ్యాప్ కు ఆమోదం లభించిన నేపథ్యంలో, తదుపరి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఎగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీకి వెళ్తుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన అనంతరం దేశాధ్యక్షుడి ఆమోదం కోసం పంపుతారు. ఆయన ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలో కొత్త మ్యాప్ ను పొందుపరుస్తారు.
మరోవైపు, ఈ భూభాగాలన్నీ తమవేనని భారత్ వాదిస్తోంది. అయితే, చైనా ప్రోద్బలంతోనే నేపాల్ ఈ సాహసానికి ఒడిగడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త మ్యాప్ కు నేపాల్ పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో... భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.