Allu Arjun: కొరటాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజక్టు

Koratala Shiva to direct Allu Arjun
షార్ట్స్‌లో చూడండి
ఎప్పటి నుంచో అనుకుంటున్న కాంబినేషన్ ఇప్పుడు సెట్ అవుతోంది. అన్నీ సవ్యంగా కుదిరితే త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుంది. అదే అల్లు అర్జున్.. కొరటాల శివ కాంబో! వీరిద్దరి కలయికలోనూ సినిమా వస్తుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్నా, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ఈ క్రమంలో ఇటీవల బన్నీని కలసి కొరటాల కథ చెప్పాడనీ, అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇద్దరి మధ్యా జరిగాయనీ తెలుస్తోంది. మామూలుగా కొరటాల తన ప్రతి సినిమాలోనూ సామాజిక సందేశం ఉండేలా చూసుకుంటారు. అలాంటి సరికొత్త సందేశంతోనే ఈ కథను కూడా ఆయన తయారుచేసినట్టు, బన్నీకి ఇది బాగా నచ్చినట్టు చెబుతున్నారు.

ఇక కొరటాల ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తుండగా, సుకుమార్ తో బన్నీ 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజక్టులు పూర్తయ్యాక దీని షూటింగ్ మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. పైగా, పాన్ ఇండియా చిత్రంగా దీనిని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి నిర్ణయించారని సమాచారం.
Go Back to Shorts
Allu Arjun
Koratala Siva
Chiranjeevi
Sukumar

More Telugu News