అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించిన దళిత యువకుడిపై అమానుష దాడి.. మృతి!
- మహారాష్ట్రలోని పుణెలో ఘటన
- యువకుడిపై ఉమ్మివేసి, రాళ్లు, రాడ్లతో దాడి
- రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన యువకుడు
- యువకుడిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు
దీంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అతడిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల వారు ఆ యువకుడికి ఫోన్ చేసి మాట్లాడాలని పిలిపించారు. దీంతో అతడు వారి ఇంటికి వెళ్లాడు. కులం పేరుతో అతడిని తిడుతూ అవమానించడంతో అతడు అక్కడ నుంచి బయటకు వచ్చి బైక్‌పై వెళ్లాడు.
అయితే, మధ్యలో ఆ యువకుడిని అమ్మాయి తరఫు బంధువులు ఆరుగురు అడ్డుకుని టెంపోతో దాడి చేశారు. దీంతో విరాజ్ బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. ఆ యువకుడి ముఖంపై ఉమ్మి వేస్తూ, రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న విరాజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.