హంద్రీనీవా ప్రాజెక్టుకు మళ్లీ పాత పేరే ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
- 2007లో అనంత వెంకటరెడ్డి పేరిట ప్రాజెక్టుకు నామకరణం
- 2014లో చంద్రబాబు సర్కారు రాక
- మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు తొలగింపు
- పాత పేరును పునరుద్ధరించిన జగన్ సర్కారు
అయితే, 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగా ఆ మరుసటి ఏడాదే ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు తొలగించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, ప్రాజెక్టుకు పాతపేరునే పునరుద్ధరించారు. ఇకపై దీన్ని పాతపేరు 'అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి'గా పిలవాలని నిర్ణయిస్తూ ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.