అరేబియా సముద్రంలో నిసర్గ... మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లో హైఅలర్ట్
- అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం
- మరో 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం
- ముంబయిపై పంజా విసరనున్న నిసర్గ!
తుపాను హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 105 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ముంబయి మహానగరంపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు.