కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఈసారి వానలే వానలు!
- ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం కురిసేందుకు 102 శాతం అవకాశం
- ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
- నేడు తుపానుగా మారనున్న అల్పపీడనం
ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువగా, దక్షిణ భారతదేశంలో సాధారణంగా, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే ఈ సీజన్‌లో 75 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు.
మరోవైపు, అరేబియా సముద్రంలో ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది నేడు తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఈశాన్య దిశగా పయనించి మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా హరిహరేశ్వర్-దమణ్‌ల మధ్య తీరాన్ని తాకుతుందని చెప్పారు.