కేసీఆర్ గారికి నేనంటే పుత్ర వాత్సల్యం ఉంది: బాలకృష్ణ
- ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల భేటీ
- బాలయ్యకు అందని పిలుపు
- తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలయ్య
- తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ
దీనిపై ఓ ఇంటర్వ్యూలో బాలయ్య వివరణ ఇచ్చారు. కేసీఆర్ గారు ఈ సమావేశాలకు తనను ఎందుకు పిలవలేదో తెలియదని, ఆయనకు తనపై ఎప్పుడూ కోపం లేదని స్పష్టం చేశారు. పైగా, ఎన్టీఆర్ అభిమాని అయిన కేసీఆర్ కు తానంటే పుత్ర వాత్సల్యం ఉందని తెలిపారు. ఈ ఘటనను రాజకీయపరంగా చూడొద్దని పేర్కొన్నారు. గతంలో తాను కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల కారణంగా పిలిచుండకపోతే ఆ విషయమైనా తనతో చెప్పి ఉండాల్సిందని అన్నారు.