సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- అది నిర్మాతల ఇష్టమంటున్న రకుల్!
- దసరాకి వస్తున్న సాయితేజ్ సినిమా
- శ్రీలంక నేపథ్యంలో విజయ్ సేతుపతి
- మళ్లీ వస్తున్న కామ్న జెత్మలానీ
* మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అసలు ఏప్రిల్ లోనే విడుదల చేయాలనుకున్నారు. అయితే, లాక్ డౌన్ వల్ల షెడ్యూల్స్ అప్ సెట్ అయ్యాయి.
* తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ నటుడు విజయ్ సేతుపతి తాజా చిత్రం శ్రీలంక నేపథ్యంలో సాగుతుంది. వెంకట కృష్ణ రఘునాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది.
* గతంలో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన కామ్న జెత్మలానీ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ కి వస్తోంది. ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన కామ్న తాజాగా తెలుగులో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. నూతన దర్శకుడు ప్రభు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనుంది.