మహారాష్ట్రలో సాధువుల వధ... తెలంగాణలో పట్టుబడిన నిందితుడు!
- నాందేడ్ లో ఇద్దరు సాధువుల హత్య
- సవాల్ గా తీసుకున్న పోలీసులు
- నిర్మల్ జిల్లాలో నిందితుడి అరెస్ట్
- డబ్బు కోసమే చంపానన్న నిందితుడు
ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుడు తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పట్టుబడ్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా, కేవలం డబ్బు కోసమే సాధువులను హత్య చేసినట్టు అంగీకరించాడు. అతడి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆపై రిమాండ్ కు తరలించారు.