భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్‌: యాంకర్ అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్‌: యాంకర్ అనసూయ

anasuya about her husband
  • అభిమానులతో అనసూయ చాట్ 
  • మీ భర్తే మీ ఫస్ట్‌ బాయ్‌ఫ్రెండ్ అంటూ అభిమాని ట్వీట్
  • 'నా మొదటి‌, రెండో, మూడో.. ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఆయనే' అన్న అను
యాంకర్ అనసూయ తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో చాట్ చేసింది. ఈ సందర్భంగా మీ భర్తే మీ ఫస్ట్‌ బాయ్‌ఫ్రెండ్ అంటూ అనసూయ దంపతుల ఫొటోని అభిమాని షేర్‌ చేశాడు. దీనిపై స్పందించిన అనసూయ 'నా మొదటి‌, రెండో, మూడో.. ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్‌' అని పేర్కొంది.
             
కాగా, మరో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ..  విలువల విషయంలో తాను ఎక్కడా రాజీ పడకుండా అవకాశాలను వినియోగించుకున్నానని ఆమె తెలిపింది. మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యమని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పింది. పవన్ కల్యాణ్ సినిమాలో ఎప్పుడు నటిస్తారని అనసూయను ఓ అభిమాని అడిగాడు.

దీనికి ఆమె స్పందిస్తూ... తాను కూడా ఆయన సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. తన పెళ్లి జరిగి పదేళ్లు అవుతుందని, తాము ఈ ఏడాది వెడ్డింగ్ యానివర్సరీని ఇటలీలో జరుపుకోవాలని ఆశించామని తెలిపింది. అనుకున్నవి ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేమని ఆమె చెప్పింది. కాగా, కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

anasuya
youtube
Social Media

More Telugu News