వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 16 మంది వలస కూలీల దుర్మరణం
- బీహార్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి
- మహారాష్ట్రలో బస్సు, ట్రక్కు ఢీ
- యూపీలో డీసీఎం బోల్తా
మరోపక్క, మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలస కూలీలు మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. షోలాపూర్ నుంచి ఝార్ఖండ్‌కు వెళ్తున్న వలస కూలీల బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
ఇదిలావుంచితే, సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి బోల్తాపడడంతో ఈ ఘటన జరిగింది.