మంత్రులు, ఎమ్మెల్యేలు విష‌వాయువులు పీల్చి చావ‌డానికి సిద్ధ‌మా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు: నారా లోకేశ్

Nara Lokesh criticises CM Ys Jagan
  • విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో వైసీపీ నేత వ్యాఖ్యలపై ఫైర్
  • చనిపోతే రూ.కోటి వచ్చేదని ఒకరిద్దరు వ్యాఖ్యానించారన్న వైసీపీ నేత
  • ఈ వ్యాఖ్యలపై బాధితులు మండిపడుతున్నారన్న లోకేశ్
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తమ ప్రాణాలు పోయినా కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం వచ్చి ఉండేదని ఒకరిద్దరు అనుకున్నవారూ లేకపోలేదంటూ వైసీపీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళా బాధితురాలు మండిపడటాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రస్తావించారు.

 ఈ మేరకు ఓ ట్వీట్ తో పాటు వీడియోను పోస్ట్ చేశారు. ఈ విధంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధితులేమో అదే కోటి రూపాయల చొప్పున ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు విషవాయువులు పీల్చి చావడానికి సిద్ధమా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారని, ‘ఏమంటారు జగన్ గారు?’ అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Vizag Gas Leak

More Telugu News