విదేశాల నుంచి నేడు రానున్న మరో ఆరు ప్రత్యేక విమానాలు!
- 300 మంది ప్రయాణికులతో లండన్ నుంచి బెంగళూరు చేరిక
- శాన్ ఫ్రాన్సిస్కో, అబుదాబి నుంచి హైదరాబాద్ రానున్న విమానాలు
- కౌలాలంపూర్ నుంచి చెన్నైకు, ఢాకా నుంచి ముంబైకు రెండు విమానాలు
వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు ఇంకా ఆరు ప్రత్యేక విమానాలు ఈరోజు నడుస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ కు, అబుదాబి నుంచి హైదరాబాద్ కు, కౌలాలంపూర్ నుంచి చెన్నైకు, ఢాకా నుంచి ముంబైకు, దుబాయ్ నుంచి కొచ్చికి, బహ్రెయిన్ నుంచి కోజికోడ్ కు ఈ ప్రత్యేక విమానాలు చేరుకోనున్నాయి.