ప్రపంచమంతా మాతృ దినోత్సవం జరుపుకుంటోంది.. కానీ, ఏపీ ప్రజలు మాత్రం..!: నారా లోకేశ్
- ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఉత్సవాన్ని జరుపుకునే ఉత్సాహంతో లేరు
- కారణం విశాఖ దుర్ఘటన
- కళ్లముందే కనుపాపలు కనుమూస్తుంటే ఏమీ చేయలేకపోయారు
- ఆ తల్లులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను
'ఇలాంటి ఉపద్రవాలు ఇకపై జరగవని ప్రతి తల్లికీ భరోసా అందిన రోజే రాష్ట్రంలో నిజమైన మాతృదినోత్సవం జరుపుకుంటారు ప్రజలు. తమ పిల్లలను కోల్పోయిన బాధనుండి ఆ తల్లులు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.