మీ నాయకులను ఆ మందు తాగమనండి.. అర్థమైపోతుంది!: జగన్ కు సోమిరెడ్డి సూచన
- ఆ ‘క్యూ’ లను చూస్తే పేదోళ్లా? ధనవంతులా? అర్థమౌతుంది
- నాణ్యత లేని మద్యం ధరలు పెంచడం ఘోరం
- మద్యం ధరలు పెంచితే పేదోడు తాగడనేది కరెక్టు కాదు
ఈ నాణ్యత లేని మద్యం తయారీకి కేవలం పదిహేను నుంచి ఇరవై రూపాయల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం మాత్రం రూ.150 నుంచి రూ. 250కు విక్రయిస్తోందని, ప్రొడక్షన్ కాస్ట్ కన్నా ఎక్కువ ధరలకు విక్రయించడం క్షమించరాని నేరమని అన్నారు. మద్యం ధరలు పెంచడం వల్ల పేదోడు తాగడనే వాదన అర్థం లేనిదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మద్యం తాగడం అలవాటు ఉన్న ఏ పార్టీలోని వ్యక్తులైనా ఆ మద్యం తాగితే పరిస్థితేంటో అర్థమైపోతుందని అన్నారు. ‘మీ నాయకులను రెండు మూడ్రోజులు ఆ మందు తాగమనండి.. అర్థమైపోతుందంటూ’ సీఎం జగన్ కు సోమిరెడ్డి సూచన చేశారు.