కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ హైకోర్టు
- ఏడాది పాటు న్యాయమూర్తుల బదిలీలు నిలిపివేత
- ప్రమోషన్లను కూడా ఆపివేస్తున్నట్టు ప్రకటన
- అత్యవసర దరఖాస్తులతో వస్తే మాత్రం పరిశీలన
ఇదే సమయంలో న్యాయమూర్తులు ఎవరైనా వ్యక్తిగత, అత్యవసర దరఖాస్తులతో వస్తే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ప్రస్తుతం హైకోర్టును మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర పిటిషన్లను మాత్రం న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు.