మంత్రి పేర్ని నాని అవగాహన లేని వ్యక్తి: వర్ల రామయ్య

Varla Ramaiah fires on Perni Nani
  • చంద్రబాబుపై పేర్ని నాని వ్యాఖ్యలు
  • టీడీపీ నేతల ఆగ్రహం
  • మద్యం షాపులు తెరవడం దుర్మార్గపు చర్య అని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబే ప్రజలకు డబ్బులిచ్చి వైన్ షాపులకు పంపుతున్నాడంటూ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడంపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మంత్రి పేర్ని నాని అవగాహన లేని వ్యక్తి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య విమర్శించారు.

మద్యం షాపులు తెరవడం దుర్మార్గపు చర్య అని, మద్యం షాపులు తెరిచి ప్రభుత్వం అభాసుపాలైందని అన్నారు. చేసిన తప్పు దిద్దుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని వ్యాఖ్యానించారు. మద్యం షాపుల వద్ద టీచర్లను నిలబెట్టిన దౌర్భాగ్యపు ప్రభుత్వమిది అంటూ మండిపడ్డారు. వైసీపీ దుర్మార్గపు చర్యల వల్లే ఏపీలో అరాచకాలు ప్రబలాయని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వైన్ షాపులు మూసేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

అంతకుముందు, పంచుమర్తి అనురాధ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పేర్ని నాని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైన్ షాపుల ముందు నిలబడేవారంతా టీడీపీ కార్యకర్తలైతే, వైసీపీ కార్యకర్తల ఇళ్లకు మీరు మద్యం పంపిణీ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతల వికృత చేష్టల వల్లే ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువైందని ఆరోపించారు.
Go Back to Shorts
Varla Ramaiah
Perni Nani
Andhra Pradesh
Liquor Shops

More Telugu News