కరోనా విజృంభిస్తున్న సమయంలో 'జగనన్న బీరు పండుగ' ఘనంగా ప్రారంభమైంది: లోకేశ్
- దేశవ్యాప్తంగా తెరుచుకున్న మద్యం దుకాణాలు
- మద్యం అమ్మకాలకు అనుమతించిన కేంద్రం
- మద్యనిషేధానికి కొత్త అర్థం చెప్పారంటూ జగన్ పై లోకేశ్ వ్యంగ్యం
మద్య నిషేధం మాటున చీకటి దందా సాగుతోందని ఆరోపించారు. మద్య నిషేధం అంటే రేట్లు పెంచడం, వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడమని వైఎస్ జగన్ సరికొత్త అర్థం చెప్పారని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. లాక్ డౌన్ సమయంలో వైసీపీ ఎలుకలు తాగిన కోట్ల రూపాయల మద్యం లెక్కలు సరిచేసేందుకే లిక్కర్ అమ్మకాలకు పచ్చజెండా ఊపారని ఆరోపించారు.