పచ్చి మామిడి ముక్కలు తింటోన్న హీరోయిన్ దీపిక.. 'ఏంటీ విశేషమా?' అని అడుగుతోన్న అభిమానులు!
Add ap7am to your home Screen

పచ్చి మామిడి ముక్కలు తింటోన్న హీరోయిన్ దీపిక.. 'ఏంటీ విశేషమా?' అని అడుగుతోన్న అభిమానులు!

deepika padukune eats mangoes
  • మామిడి ముక్కల ఫొటోను పోస్ట్ చేసిన దీపిక
  • శుభవార్త చెబుతావా? అంటోన్న నెటిజన్లు
  • ఇంట్లోనే ఎంజాయ్‌ చేస్తోన్న హీరోయిన్
  పచ్చి మామిడి ముక్కలు కోసి.. వాటిపై కారం చల్లి ఆ ఫొటోను పోస్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకుణె తీరును చూసిన అభిమానులు, 'ఏంటీ విశేషమా?' అంటూ అడుగుతున్నారు. కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో షూటింగులు కూడా బంద్‌ కావడంతో సినీ ప్రముఖులు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దీపిక కూడా భర్త రణవీర్ సింగ్ తో కలసి ఇంట్లోనే కాలక్షేపం చేస్తోంది.
                                                          
ఈ క్రమంలో దీపిక మామిడి ముక్కలు కోసి దానిపై ఉప్పు, కారం చల్లి ఫొటో తీసి పోస్ట్ చేసింది. పచ్చి మామిడి ముక్కల్ని చూసిన నెటిజన్లకు డౌటు వచ్చేసింది. ఏమైనా శుభవార్త చెబుతావా? అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమె రణ్‌వీర్‌ సింగ్‌ను 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు చాలా సందర్భాల్లో పిల్లల గురించిన ప్రశ్న ఎదురైంది. వాటిని ఆమె తిరస్కరిస్తూ వస్తోంది. మరి ఇప్పుడైనా ఆ వార్త చెబుతుందేమో చూడాలి!
deepika padukune
Bollywood
Twitter

More Telugu News