ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వైసీపీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకుంటూ  భారీ పెయింటింగ్ వేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మున్సిపల్ మార్కెట్ సెంటర్ రోడ్డుపై ఈ భారీ పెయింటింగ్ వేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడి అధికారులతో కలిసి ఈ పెయింటింగ్ ను చూసిన ఆయన మెచ్చుకున్నారు.