మహారాష్ట్రలో దారుణం.. క్షణికావేశంలో కుమారుల్ని కాల్చి తానూ కాల్చుకున్న తండ్రి!
- తండ్రి, పెద్ద కుమారుడి మృతి
- ప్రాణాలతో పోరాడుతున్న మరో కుమారుడు
- కుటుంబ కలహాలే కారణమని అనుమానం
కుమారులు ఆకాశ్ ద్వివేదీ (22), పవన్ ద్వివేదీ (20)లతో మూల్‌చంద్‌కు నిన్న గొడవ జరిగింది. అది మరింత ముదరడంతో ఆగ్రహం పట్టలేని మూల్‌చంద్ తన తుపాకితో కుమారులిద్దరిపైనా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో మూల్‌చంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పెద్ద కుమారుడు ఆకాశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పవన్ మృత్యువుతో పోరాడుతున్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.