ఉద్ధవ్ థాకరేను ఎమ్మెల్సీగా నియమించాలంటూ రెండోసారి తీర్మానం చేసిన 'మహా' కేబినేట్
- ఈ నెల 9న తొలిసారి తీర్మానించిన కేబినెట్
- ఆమోదించని గవర్నర్ కోష్యారీ
- మే 28 లోపు ఎమ్మెల్సీ కాకుంటే పదవి కోల్పోయే ప్రమాదం
ఉద్ధవ్‌ను ఎమ్మెల్సీగా నియమించాలంటూ ఈ నెల 9న తొలిసారి తీర్మానం చేసి, మంత్రివర్గం దానిని గవర్నర్‌కు పంపింది. అయితే, ఆ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించకపోవడంతో తాజాగా రెండోసారి తీర్మానం చేసి పంపారు. అయితే, ఈసారైనా గవర్నర్ ఆమోదిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మే 28కి ఆరు నెలలు పూర్తవుతుంది. ఆ లోపు ఉద్ధవ్ ఎమ్మెల్సీగా నామినేట్ కాకుంటే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తప్పదు.