అందుకే ఏపీలో ఇంతగా కరోనా!: వీడియో రూపంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిల ప్రియ

akhila priya fires on ap govt
  • మన ప్రభుత్వం కరోనాను తక్కువగా అంచనా వేసింది.
  • అది మామూలు జ్వరమేనని ప్రకటించింది
  • పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పింది
  • ఈ తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకీ అధికమవుతుండడం పట్ల టీడీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి అఖిల ప్రియ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో రూపంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

'ఈ రోజు మన రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కారణమేంటనే విషయాన్ని పరిశీలిస్తే అందుకు మొదటి కారణం.. మన ప్రభుత్వం కరోనాను తక్కువగా అంచనా వేయడమే. మన దేశంలో కరోనా కేసులు పెరిగిపోతోన్న సమయంలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిల్లీగా తీసి పడేసింది. అది మామూలు జ్వరమేనని ప్రకటించింది. పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పింది.
 
ఈ తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే ఏపీలో కరోనా పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరులో ప్రజలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనాను చాలా లైట్‌గా తీసుకున్నారు. కరోనా విజృంభణతో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది' అని అఖిల ప్రియ తెలిపారు.

'సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికలపై పెట్టిన దృష్టిని కరోనాపై పెట్టలేదని అర్థమవుతోంది. పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు చేస్తోన్న పనులతో రాష్ట్రంలో కరోనా పెరిగిపోతోంది. అధికారులు తమ పనులను పక్కనపడేసి వైసీపీ నేతల వెనుక నిలబడి వారు చేస్తోన్న ఆర్భాటాలను చూస్తూ ఉండిపోవాల్సి వస్తోంది' అని మండిపడ్డారు.
Go Back to Shorts
akhila priya
Telugudesam
Corona Virus
Andhra Pradesh

More Telugu News