స్మార్ట్ ఫోన్లపై కరోనా వైరస్ ఎన్నిరోజులు సజీవంగా ఉంటుందో తెలుసా..?
- ఫోన్ వాడకం ద్వారా కూడా కరోనా సోకే అవకాశాలు
- గాజు ఉపరితలంపై కరోనా వైరస్ 4 రోజులు జీవించే అవకాశం
- ప్లాస్టిక్ పై 3 రోజుల వరకు మనుగడ
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న నావెల్ కరోనా వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ ఉపరితలాలపై 3 రోజుల వరకు సజీవంగా ఉండగలదని, కార్డు బోర్డు ఉపరితలాలపై 24 గంటలు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే ప్రస్తుత కరోనా వైరస్ గాజు ఉపరితలంపై ఎంతకాలం బతకగలదన్న విషయం తాజా అధ్యయనంలో స్పష్టం కాకపోయినా, గత అధ్యయనాల ఆధారంగా నాలుగు రోజుల పాటు జీవించగలదని భావిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లను గ్లాస్ లేదా ప్లాస్టిక్ తో తయారుచేస్తారన్న సంగతి తెలిసిందే.