గాయని కనిక కపూర్ పై ఎఫ్ఐఆర్ నమోదు
- తనకు కరోనా సోకిందని సోషల్ మీడియాలో వెల్లడించిన గాయని
- స్క్రీనింగ్ తర్వాత ఓ పార్టీకి హాజరైన కనిక
- నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు
మార్చి 14న లక్నో ఎయిర్ పోర్టులో నిర్వహించిన కరోనా పరీక్షల్లో అత్యధిక స్థాయిలో వైరస్ ఉన్నట్టు గుర్తించారు. ఇంటిలోనే నిర్బంధంలో ఉండాలని సూచించినా ఆమె పాటించకుండా పార్టీకి హాజరయ్యారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. లక్నోలో కనిక కపూర్ హాజరైన విందు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు రావడంతో కరోనా కలకలం రేగింది. తనకు కరోనా సోకిందని కనిక సోషల్ మీడియాలో ప్రకటించడంతో, ఆ పార్టీకి హాజరైన వాళ్లందరూ హడలిపోతున్నారు.