Nirbhaya: ఉరితీతకు ఏర్పాట్లు పూర్తి ...భయం లేని నిర్భయ దోషులు!

All set for Nirbhaya convicts execution
షార్ట్స్‌లో చూడండి
ఎట్టకేలకు నిర్భయ దోషులను రేపు ఉదయం ఉరితీయనున్నారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఢిల్లీలోని తీహార్ జైల్లో తలారి పవన్ జల్లాడ్ ఉరితీస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఉరితీత ఖాయమన్న నేపథ్యంలో నిర్భయ దోషుల్లో భయం కానీ, దారుణ నేరం పట్ల పశ్చాత్తాపం కానీ కనిపించడంలేదని జైలు వర్గాలంటున్నాయి.

మరణశిక్షకు ముందు చివరి కోరిక ఏంటో చెప్పమన్నా చెప్పలేదని, వారిలో ఆందోళన మచ్చుకైనా కనిపించడం లేదని ఓ అధికారి వెల్లడించారు. కాగా, బుధవారం సాయంత్రం నుంచి వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందని, అందుకే వారితో ఎక్కువగా మాట్లాడొద్దని ఉన్నతాధికారులు తమకు సూచించారని ఆ అధికారి తెలిపారు.
Go Back to Shorts
Nirbhaya
Death
Hang
Tihar
New Delhi

More Telugu News