తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో కరోనా కేసు నమోదు

coronavirus cases in telangana
  • తెలంగాణలో ఇప్పటికే ఐదుగురికి కరోనా
  • బ్రిటన్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ 
  • గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం  ఐదుగురికి చికిత్స
తెలంగాణలో మరో కరోనా వైరస్‌ కేసు నమోదయింది. తెలంగాణలో ఇప్పటికే ఐదుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని వచ్చిందని వైద్యులు ప్రకటించారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ అని తేలిన వారి సంఖ్య ఆరుకి తేలింది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఒకరికి గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేసి డిశ్చార్జ్‌ చేశారు.

విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనపడితే వెంటనే ఐసోలేషన్ వార్డులు తరలించి, నమూనాలను పూణెకు పంపుతున్నారు. కరోనా సోకిందని తేలితే వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Corona Virus
Telangana

More Telugu News