IYR Krishna Rao: నాడు బాబు చేసిన హంగామాకు, నేడు జగన్ చేస్తున్న దానికి పెద్దగా తేడా లేదు: ఐవైఆర్
తనకున్న పరిచయాలతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారంటూ చంద్రబాబుపై సీఎం జగన్ ధ్వజమెత్తగా, ప్రపంచమంతా కరోనాను హడలెత్తి పోతుండగా, జగన్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అటు చంద్రబాబు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. నాడు సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి చేసిన హంగామాకు, ఇవాళ జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై చేస్తున్న హంగామాకు పెద్దగా తేడా ఏమీలేదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జగన్, చంద్రబాబు పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్న వీడియోను కూడా టిట్టర్ లో పోస్టు చేశారు.