కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం

Trial run from Kaleswaram project to Anantagiri reservoir successful
  • అనంతగిరి రిజర్వాయర్ కు ఎత్తిపోతల ట్రయల్ రన్
  • విజయవంతమైన ట్రయల్ రన్
  • లక్షలాది ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు
  • ఇంజినీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. లక్షలాది ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో భారీస్థాయిలో ఇంజినీరింగ్ అద్భుతం అనదగ్గ రీతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచి తాజాగా అనంతగిరి రిజర్వాయర్ కు నీటి ఎత్తిపోతల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోవడంతో సర్వత్ర హర్షం వ్యక్తమైంది. దీనికి సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్టు చేసింది.
Go Back to Shorts
Kaleswaram
Anantagiri
Reservoir
Trial Run
Telangana
TRS

More Telugu News