ఆస్తిలో సగం తమ్ముడికి, సగం భార్యకు... అమృత పేరిట ఒక్క పైసా కూడా రాయని మారుతీరావు!
- గతంలో రాసిన వీలునామాను మార్చిన మారుతీరావు
- పోలీసుల చేతిలో మారుతీరావు వీలునామా
- నిందితుడిగా ఆయన పేరును తొలగించండి
- నేడు కోర్టులో పోలీసుల పిటిషన్
కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, తానెంతగానో ప్రేమతో చూసుకున్న కుమార్తె, ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు. తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. కుమార్తె అమృత పేరిట ఆయన ఒక్క పైసా ఆస్తి కూడా రాయలేదు. గతంలో అమృత భర్త ప్రణయ్ హత్య తరువాత, తన ఆస్తిలో అధిక భాగాన్ని మారుతీరావు తన కుమార్తె పేరిటే రాసినట్టుగా ప్రచారం జరిగింది. ఆపై జరిగిన పరిణామాలు ఆయన తన వీలునామాను మార్చుకునేలా చేశాయని తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఈ కేసులో మొత్తం 102 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1,200 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఏ1గా మారుతీరావు ఉండగా, ఏ6గా ఆయన తమ్ముడు శ్రవణ్ ఉన్నారు.