Jagan: ఏపీ ‘స్థానిక’ సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్​ పై సీఎం జగన్​ కీలక నిర్ణయం

AP CM Jagan takes a key decision
షార్ట్స్‌లో చూడండి
హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు అమలు కానున్న విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భావించిన వైసీపీకి ఈ తీర్పుతో ఎదురుదెబ్బతగిలినట్టయింది. అయితే, బీసీలకు 34 శాతం సీట్లు ఇచ్చే విషయమై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరఫున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. తమ పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh
Local body Elections
BC Reservations

More Telugu News