నా పర్యటనను అడ్డుకోవడానికి ఇడుపులపాయ దొంగలు వచ్చారు: నారా లోకేశ్
- నా పర్యటనను అడ్డుకునేందుకు ‘పెయిడ్ ఆర్టిస్ట్ లు’ వచ్చారు
- ఇది పులివెందుల, ఇడుపులపాయ కాదు
- ఇంకోసారి ఇక్కడికి వస్తే, తరిమి తరిమి కొడతాం
‘ఇది పులివెందుల, ఇడుపులపాయ‘ కాదని, ఇంకోసారి ఇక్కడికి వస్తే, తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, అందరికీ మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని చూస్తే ఊరుకోమని వైసీపీ నేతలను హెచ్చరించారు. ‘ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి. ప్రజాసమస్యలను పరిష్కరించండి. అంతేకానీ, టీడీపీ కార్యకర్తలను, నాయకులను అడ్డుకుంటే మేము సహించం‘ అని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.