రాధిక నాకు అమ్మ కాదు... ఆంటీ మాత్రమే!: నటి వరలక్ష్మీ శరత్ కుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాధిక నాకు అమ్మ కాదు... ఆంటీ మాత్రమే!: నటి వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi Sarat Kumar Comments On Radhika
  • రాధికను ఆంటీ అనే పిలుస్తాను
  • తండ్రితో సమానంగా గౌరవిస్తాను
  • ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మి
తన తండ్రి శరత్ కుమార్ ను రెండో వివాహం చేసుకున్న నాటి హీరోయిన్ రాధిక, తనకు ఆంటీ మాత్రమేనని, తాను ఆమెను అలాగే పిలుస్తానని, ఆమె తనకు అమ్మ కాదని విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారని, రాధికను ఆంటీ అనే తాను పిలుస్తూ ఉంటానని, ఇదే సమయంలో ఆమెకు గౌరవాన్ని ఇస్తానని చెప్పింది.

అవకాశం చిక్కినప్పుడల్లా తనలోని బోల్డ్ నెస్ ను బయట పెడుతూ ఉండే వరలక్ష్మి, తాజా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తనకు ఏదనిపిస్తే అదే చేస్తానని, అందుకే తనతో మాట్లాడేందుకు చాలా మంది బయపడుతూ ఉంటారని వ్యాఖ్యానించింది. కాగా, శరత్ కుమార్ తొలి భార్యకు వరలక్ష్మి జన్మించిందన్న సంగతి తెలిసిందే. ఆపై భార్యకు దూరమైన శరత్ కుమార్, రాధికను రెండో వివాహం చేసుకున్నారు.

తెగువ, ధైర్యం చూపిస్తూ, 'పోడా పోడీ' చిత్రంతో పరిచయమైన ఈ భామ, తెలుగు, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. లేడీ విలన్ పాత్రలంటే, ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వైపే చూసే పరిస్థితి ఏర్పడింది. తక్కువ కాలంలోనే పాతిక చిత్రాలను దాటేసిన వరలక్ష్మి చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయని సమాచారం.
Varalakshmi Sharat Kumar
Radhika
Aunty
Mother
Sarat Kumar

More Telugu News