విశాఖలో నిన్నటి పరిణామాలపై హైకోర్టులో పిటిషన్... విచారణ మార్చి 2కి వాయిదా
- ఉత్తరాంధ్ర పర్యటన కోసం నిన్న విశాఖ వెళ్లిన చంద్రబాబు
- బాబును అడ్డగించిన వైసీపీ కార్యకర్తలు
- చంద్రబాబును హైదరాబాద్ పంపించివేసిన పోలీసులు
- పోలీసుల వైఖరి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేత పిటిషన్
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వినడం జరిగింది. ఈ సందర్భంగా, ఉత్తరాంధ్ర పర్యటన కోసం చంద్రబాబు ముందుగానే అనుమతి తీసుకున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కాగా, చంద్రబాబుకు విశాఖలో సెక్షన్ 151 కింద నోటీసులు ఇవ్వడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఆ సెక్షన్ కింద ఎలా నోటీసులు ఇచ్చారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనిపై సమగ్ర అఫిడవిట్ ఫైల్ చేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు.