సమంత చేయనున్నది హారర్ చిత్రమేనట!

Ashwin Sharavanan Movie
  • అశ్విన్ శరవణన్ నుంచి మరో హారర్ థ్రిల్లర్ 
  • ప్రధాన పాత్రధారిగా సమంత 
  • త్వరలోనే సెట్స్ పైకి  
తమిళంలో హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో అశ్విన్ శరవణన్ సిద్ధహస్తుడు. ఆయన రూపొందించిన 'మాయ' (మయూరి) 'గేమ్ ఓవర్' చిత్రాలు రెండూ కూడా హారర్ థ్రిల్లర్ చిత్రాలే. ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా భయపెట్టాయి. ఆ సినిమాలను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్, తాజాగా మరో సినిమాను రూపొందించడానికి రంగంలోకి దిగాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రకిగాను సమంతను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ జోనర్లో ఉంటుందోననే ఆసక్తి ఏర్పడింది. ఈ సారి కూడా అశ్విన్ శరవణన్ హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథనే ఎంచుకున్నాడట. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తిస్తూ, అనుక్షణం భయపెట్టే పాత్రలోనే సమంత కనిపించనుందని అంటున్నారు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'రాజుగారి గది 2' వంటి హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటించిన అనుభవమున్న సమంత, తాజా హారర్ మూవీలో ఒక రేంజ్ లో భయపెట్టేయడం ఖాయమనే అనుకోవచ్చు.
Go Back to Shorts
Samantha
Ashwin Sharavanan
KollyWood

More Telugu News