నేను అధికారంలో ఉంటే పెన్షన్లు పెరిగేవి: చంద్రబాబు
- చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
- వైసీపీకి ఓటేసినందుకు పొట్టకొడుతున్నారంటూ ఆగ్రహం
- పేదవాడు బతికే వీల్లేకుండా కంపెనీలను తరిమేస్తున్నారని మండిపాటు
ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో పనులు జరిపామని, ఆ ఘనత తనదేనని తెలిపారు. అయితే, కాల్వలన్నీ పూర్తి చేసినా, కాంట్రాక్టర్లు సరిగా పనిచేయలేదని ఆరోపించారు. మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పూర్తయ్యేదని అన్నారు. 'నా మీద ఏదో తవ్వి చివరికి ఎలుక తోక కూడా పట్టుకోలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ సిట్ వేశారు, ఏం తవ్వుతారో తవ్వుకోండి' అంటూ సవాల్ విసిరారు.