కూతురు సక్సెస్ పై అమితాబ్​ భావోద్వేగ సందేశం..
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూతురు సక్సెస్ పై అమితాబ్​ భావోద్వేగ సందేశం..

Amitabh Bachchan pens emotional post
  • వస్త్ర వ్యాపారంలోకి  శ్వేతా బచ్చన్
  • ఎమ్ ఎక్స్ ఎన్ బ్రాండ్ నేమ్ తో కొత్త డిజైనర్ వేర్ 
  • తొలి లగ్జరీ కలెక్షన్ విడుదల
  • శ్వేత ఘనతను కొనియాడిన బిగ్ బి
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన కూతురు శ్వేతా బచ్చన్ పై ప్రేమను మరోసారి చాటుకున్నారు. వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టిన శ్వేత ప్రముఖ డిజైనర్ మోనిషా జైసింగ్ తో కలిసి ‘ఎమ్ ఎక్స్ ఎస్’ అనే బ్రాండ్ నేమ్ తో కొత్త డిజైనర్ వేర్ ను స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా తన తొలి లగ్జరీ కలెక్షన్ ను ముంబైలో శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి శ్వేత డెనిమ్ జాకెట్ ధరించి హాజరైంది. ఆ జాకెట్ కుడి చేయి స్వీవ్ పై తండ్రి అమితాబ్ బొమ్మ ఉంది.

కూతురు సాధించిన ఘనతపై ఆనందం వ్యక్తం చేసిన అమితాబ్..  ఈ ఈవెంట్ కు సబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి భావోద్వేగ సందేశం రాసుకొచ్చారు. ‘కీర్తి, గౌరవం లభించిన రోజు ఇది. మన పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, వాళ్లు ఏదైనా సాధించినప్పుడు, మనకు ఆనందభాష్పాలు తెప్పించినప్పుడు, వాళ్ల సయంకృషి ఫలితాన్ని ఇచ్చినప్పుడు, ఈ ప్రపంచం వాళ్ల శ్రమను గుర్తించి మెచ్చుకున్నప్పుడు మన ముఖంలో మెరుపు కనిపిస్తుంది. మా అందరినీ గర్వపడేలా చేసినందుకు లవ్ యూ శ్వేతా’ అని పోస్ట్ చేశారు. అలాగే, శ్వేత చిన్నప్పటి ఫొటో, ఇప్పటి ఫొటో కూడా షేర్ చేశారు. చిన్నారి శ్వేత ఎప్పుడు ఇంత పెద్దది అయిందో తెలియడం లేదని రాసుకొచ్చారు.
Amitabh Bachchan
swetha Bachchan

More Telugu News