పవన్‌ కల్యాణే నన్ను జనసేనలోకి ఆహ్వానించారు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
Add ap7am to your home Screen

పవన్‌ కల్యాణే నన్ను జనసేనలోకి ఆహ్వానించారు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

JD Lakshminarayana reveals Jana Sena loopholes
  • జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు
  • ఓటు కొనబోమని చెప్పారు
  • నేను ఆలోచిస్తోన్న విధి విధానాలు ఉన్నాయి
  • మీరొస్తే బాగుంటుందని పవన్‌ కల్యాణే అన్నారు
ఎన్నికల ముందు జనసేన పార్టీలో తాను చేరడానికి గల కారణాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. 'జనసేన పార్టీలోకి ముఖ్యంగా నేను రావడానికి కారణం ఏంటంటే. జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌. జీరో బడ్జెట్ పాలిటిక్స్‌ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఓటు కొనబోమని చెప్పారు. నేను ఆలోచిస్తోన్న విధి విధానాలు ఉన్నాయి. మీరొస్తే బాగుంటుందని పవన్‌ కల్యాణే నన్ను జనసేనలోకి ఆహ్వానించారు. పార్లమెంటరీ నియోజక వర్గంలో పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సింబల్‌ వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం పడుతుంది. 16, 17 రోజులు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నాను. రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు 2,80,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఓడిపోయామని మేము ఎన్నడూ అనుకోలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా గెలుస్తామని భావించాం' అని తెలిపారు.

'పొలిట్ బ్యూరోలో నన్ను ఉండాలన్నారు. ఐదుగురితో పొలిట్ బ్యూరో ఉండడం సరికాదని, ఆ సంఖ్య ఎక్కువ ఉండాలని చెప్పాను. ఆలోచనలు అనేవి అందులో జరగాలని అన్నాను. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుందన్నాను. మనం మజ్జిగ చిలికినట్లు నిర్ణయాలను చిలకాలి. ఎక్కువ మంది మధనం చేస్తే మంచి నిర్ణయాలు వస్తాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదు. ఆ పొలిట్ బ్యూరోలో నేను లేను. నేను పార్టీలో చేరిన తర్వాత పెద్దగా సమయంలేదు. ఎన్నికలు వచ్చాయి. సమావేశాల్లో పాల్గొన్నాను. నేను ఇవ్వాల్సిన సలహాలు నేనిచ్చాను' అని చెప్పారు. పార్టీలో ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని చెప్పారు. అందరూ చర్చించాకే ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. అప్పుడే నిర్ణయాన్ని అమలు చేయడంలో అందరూ చురుకుగా పాల్గొంటారని చెప్పారు.
VV Lakshminarayana
Janasena
Pawan Kalyan

More Telugu News