Budda Venkanna: ఈ దుస్థితి జగన్ రెడ్డి గారికి 48 ఏళ్లకే వచ్చింది: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

budda venkanna criticises vijay sai reddy and jagan
షార్ట్స్‌లో చూడండి
'గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'చంద్రబాబు గారి హయాంలో కట్టిన పంచాయతీ భవనాలకు, శ్మశానాలకు, ఆఖరికి మరుగుదొడ్లకు రంగులు వేసుకొని బులుగు బ్యాచ్ తో చిటికెలు వేయించుకునే దుస్థితి జగన్ రెడ్డి గారికి 48 ఏళ్లకే వచ్చింది అనే విషయం గమనించండి విజయసాయిరెడ్డి గారు' అని విమర్శించారు.
 
'టీడీపీ హయాంలో కట్టిన పోలీస్ స్టేషన్ కి కొత్త పేరు పెట్టి ఎవరూ కొట్టకపోయినా ఆయనే డప్పు కొట్టుకోవడం చూస్తే పాపం అనిపిస్తుంది. ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇప్పటికే ఆఖరి ఛాన్స్ అయ్యింది. అన్ని తెలిసి కూడా 30 సంవత్సరాలు మీరే సారు అంటూ మీ లాంటి వారు కల్పించే భ్రమలో బ్రతికేస్తున్నారు' అని చురకలంటించారు. 'ఇప్పటికే తుగ్లక్ చరిత్ర గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు అని గ్రహించండి విజయసాయిరెడ్డి గారు' అని విమర్శించారు.
Go Back to Shorts
Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP

More Telugu News