చిరంజీవిగారు ఎవరినీ నొప్పించరు: దర్శకుడు ముత్యాల సుబ్బయ్య
- చిరంజీవిగారు నన్ను నమ్మారు
- రెండు హిట్లు ఇచ్చినందుకు ఆనందంగా వుంది
- ఆయన మంచి మనసున్న మనిషన్న ముత్యాల సుబ్బయ్య
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,"సెంటిమెంట్ తో కూడిన చిత్రాలను నేను బాగా తీయగలననే నమ్మకంతోనే చిరంజీవిగారు 'హిట్లర్' .. 'అన్నయ్య' సినిమాలను చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఆ రెండు సినిమాలను హిట్ చేసి, ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. చిరంజీవిగారు గొప్ప ఆర్టిస్ట్ ..ఆయన ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు. ఆయన అందరినీ అభిమానించే మంచి మనసున్న మనిషి. తన తోటి ఆర్టిస్టులను .. టెక్నీషియన్స్ ను బాగా గౌరవిస్తారు. తొదరపడి ఎప్పుడూ ఎవరి మనసును నొప్పించరు. ఎక్కడ కనిపించినా ఆత్మీయంగా పలకరిస్తారు" అని చెప్పుకొచ్చారు.