'ఈ రైతు వెరీ వెరీ స్పెషల్' అంటున్న వీవీఎస్ లక్ష్మణ్!
- ట్విట్టర్ లో స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్
- బాబుల్ దహియా అనే రైతు గురించి ప్రస్తావన
- 2 ఎకరాల్లో 110 వరి రకాలు పండించాడంటూ ట్వీట్
- ఎలాంటి రసాయనిక ఎరువులు ఉపయోగించలేదని వెల్లడి
"బాబుల్ దహియా మధ్యప్రదేశ్ లోని సత్నా ప్రాంతానికి చెందిన రైతు. పర్యావరణానికి హాని కలిగించరాదన్న సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఆయన నిజంగానే అద్భుతం చేశారు. కేవలం 2 ఎకరాల పొలంలో 110 రకాల వరి పంటలను పండించారు. అది కూడా ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా! బాబుల్ దహియా పండించిన ప్రతి వరి రకానిది ఒక్కోటి ఒక్కో రుచి. ఈ వరి రకాల ముందు హైబ్రిడ్ వరి కూడా దిగదుడుపే" అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు.