కేన్సర్ వ్యాధి కంటే ముందు దాని పట్ల ఉన్న భయమే మనల్ని చంపేస్తుంది: బాలకృష్ణ
- బసవతారకం ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ కేన్సర్ డే కార్యక్రమం
- హాజరైన బాలకృష్ణ, రష్మిక
- బాలలకు కేన్సర్ రావడం బాధాకరమన్న బాలయ్య
దేశానికి యువతే బలం అని, యువతీయువకులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కేన్సర్ వ్యాధి బాధితులందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనేది తన తల్లి బసవతారకం కోరిక అని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటి రష్మిక మందన్న కూడా హాజరయ్యారు. అంతేకాదు, కేన్సర్ ను జయించిన పలువురు బాలలు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.