వరుణ్ మోటార్స్ లో అవకతవకలు... ఏకకాలంలో సోదాలతో కలకలం!
- టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండానే డెలివరీ
- 300 వాహనాలను అమ్మారని తేల్చిన రవాణా శాఖ
- లాగిన్ ను సస్పెండ్ చేసిన అధికారులు
ఇదే సమయంలో సంస్థ మరిన్ని ప్రాంతాల్లో సబ్ డీలర్లను నయమించుకుని వారితో వాహనాలను విక్రయిస్తోందని కూడా వెల్లడైంది. ఇక అక్రమాలు నిజమని తేలిన నేపథ్యంలో, వరుణ్ మోటార్స్ నిర్వహిస్తున్న గ్రూప్ షోరూముల్లో కార్ల విక్రయాలు జరుగకుండా, సంస్థ లాగిన్ ను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. ఇక్కడ జరిగిన అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తున్నామని, ఆపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, వరుణ్ మోటార్స్ సంస్థ మారుతి సుజుకి వాహనాలను విక్రయిస్తుందన్న సంగతి తెలిసిందే.