Sensex: మళ్లీ విధులకు హాజరవుతున్న చైనా ఉద్యోగులు, కార్మికులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex closes in green
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. చైనా పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు నెమ్మదిగా మళ్లీ విధుల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు లాభపడి 41,216కి పెరిగింది. నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 12,110కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.95%), మారుతి సుజుకి (2.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.84%), బజాజ్ ఆటో (1.52%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.39%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.34%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-0.86%), భారతి ఎయిర్ టెల్ (-0.76%), నెస్లే ఇండియా (-0.61%), టీసీఎస్ (-0.52%), సన్ ఫార్మా (-0.39%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News